Wednesday 10 February 2010

రోజు లాగానె దినపత్రిక తిరగెస్తుంటే ఈ వారంలో ఒకే వ్యక్తి గురించి వచ్చిన రెండు వేరువేరు విషయాలు నన్ను కాస్త సంభ్రమాశ్చర్యాలకు ఆనందానికి గురిచేసాయి ......

కాస్తా (క్లుప్తంగా) ఆ వివరాలలొకి వెళ్తే .... ఆ వ్యక్తి వేరెవరొ కాదు ....రాష్ట్రానికి వచ్చిన మొదటిరోజు నుంచి తనదైన శైలిలొ వ్యవహరిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్న మన రాష్ట్ర ప్రధమ పౌరుడు శ్రీ నరసింహన్ గారు....

రాష్ట్ర ప్రధమ పౌరుడు ఆ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు కులపతి (చాన్సలర్).....ఈ వారంలొ జరిగిన అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో తనదైన వ్యవహారశైలితో అధికారగణంకి దిశానిర్దేశం చెసి, వారి గుండెలలొ రైల్లు పరిగెత్తించి రాజ్ భవన్ లోపలేకాని బయటేకాని తాను రబ్బర్ స్టాంప్ ని కాదు అని నిరూపించారు..

కంటినొప్పి, పంటినొప్పికి సైతం ఐతే ఇక్కడి కార్పొరేట్ హాస్పిటల్ కి లేకపొతే విదేశాలకి పరిగెత్తే ప్రముఖులకి భిన్నంగా మన గవర్నర్ గాంధీ ఆసుపత్రిలొ ఒక చిన్నపాటి శస్త్ర్రచికిత్స చేయించుకోవడం నిజంగా అబ్బురపరిచిన విషయం......కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తమ అవసరాలకు సొంత డబ్బులాగ ఖర్చుపెట్టే రాజకీయనాయకులకు ఇది కాస్తా కనువిప్పు కలిగిస్తుంది అని ఆశిద్దాం...

ఒక విద్యావేత్త, సమర్ధుడు, నిజాయితిపరుడైన వ్యక్తి ఒక రాజ్యాంగపరమైన ఉన్నతస్థానం అలంకరిస్తే, ఆ పదవికి ఎంత వన్నె వస్తుందొ అన్నది తెలుసుకోవడానికి ఇది కేవలం మచ్చుతునక .....అలాంటి వారందరికి నా పాదభివందనాలు. బహుశా మన పాలకులు ఇట్లాంటి విషయాలలొనైనా కాస్తా రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకుంటుంటే మనకు చాలా మేలు చెసిన వారు అవుతారు ....

Friday 5 February 2010

ఒక చిన్నమాట

నిత్యం మన చుట్టూ జరిగే చాలా విషయాలు మనల్ని చాలా ఆలొచింప చేస్తాయి ....అది మంచైనా సరే లేక చెడైనా సరే .... చిన్నదైనా సరే లేక పెద్దదైనా సరే ....

మన చుట్టూ జరుగుతున్న సంఘటనల గురించి నా అభిప్రాయాలును/ఆలోచనలను/నాలొని సంఘర్షణని నా తోటి వారితో పంచుకొవడనికి బ్లాగ్ ని ఒక మాధ్యమంగా వాడుకోదలిచాను.

ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే....మీ సలహాలు సదా స్వీకరించబడును. మీ అభిప్రాయాలు నిష్కర్షగా చెప్పుటకు వెనకడుగు వేయవద్దని మనవి.