Monday 12 April 2010

నరమేధం

స్వతంత్ర భారతదేశచరిత్రలో ఒక నెత్తుటి పుట...చెరిగిపోని అతి పెద్ద నెత్తుటి మరక


ప్రజల మౌళిక సమస్యల పరిష్కారమే ధ్యేయమని చెప్పుకొని ప్రారంభమైన ఒక ఉద్యమం(?), కాలం చెల్లిన సిద్ధాంతాలతో పూర్తిగా ప్రక్కతోవ పట్టి, కేవలం తమ అస్తిత్వం నిరూపించుకోవడానికి పచ్చని అడవులలో నెత్తుటేరులు పారిస్తుంది..నిన్నటి బలిమెల సంఘటణలో 36 మంది జవాన్లు మరణించారు అన్నది మన స్మృతిపధంలోంచి చెరగకముందే నేడు చత్తీస్‌ఘర్‌లో 76 మందిని పొట్టన పెట్టుకున్న నెత్తుటి ఉద్యమంపై ఓ సామాన్యుడి హృదయ వేదనకి అక్షరరూపం ఈ నా టపా...


ఆన్నా(??)

బహుశా మీరు విజయదరహాసంతో(?) ఉండిఉంటారు..పై చేయి సాధించాం అనే భ్రమలో ఆనందపడుతూ ఉండి ఉంటారు ...అందుకే మీకు కొన్ని విషయాలను గుర్తు చేయదలచాను...


ఒక్కసారి గుర్తుతెచ్చుకోండి..ప్రజా జీవితాలకు దూరంగా ఉండి మీరు గత 30, 40 సంవత్సరాలలో ఏమి సాధించారో..ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం, పోలీసులు, రాజకీయ నాయకులు ప్రాణాలు తీయడం తప్ప...ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులు అని మరచిన మీరా ప్రజలకు మేలు చేయగలిగేది!!!!!! బహుశా మీవలన బాగుపడ్డ కుటుంబాలుకంటే...ఇలా మీ దాడులతో నాశనమైన కుటుంబాలే ఎక్కువేమో.

పంటికి పన్ను, కంటికి కన్ను అన్నదే అందరి సిద్ధాంతం ఐతే, గుర్తుంచుకోండి ప్రపంచం ఎప్పుదో గుడ్డిదైపోయేది. అయినా మీరు పొరపాటు చెస్తే దానికి పరిహారం ఒక క్షమాపణ(దేవరకొండ ప్రజాప్రతినిధి రాగ్యా నాయక్ విషయంలో మీ క్షమాపణ అతని ప్రాణాలను తిరిగి ఇవ్వలేకపొయింది అని మీరు మరిచి ఉండొచ్చు కాని ప్రజలు మరవలేదు ), అదే అవతల వాదు చేస్తే దాని ఖరీదు వాడి ప్రాణం..


మీకు కాస్తా వయసు మీద పడితేనో లేక కాస్తా సుస్తీ చేస్తోనో లేక మిమ్మలని అడవులలో పోలీస్ బలగాలు చుట్టుముడితే అప్పటి వరకు మీరు మీ వర్గశత్రువు అనుకొని పొరాడిన ప్రభుత్వాన్ని నిస్సిగ్గుగా క్షమాభిక్ష అడగడం కడు ఆశ్చర్యం కలిగించే విషయం..కాని దీని బట్టి ఒక విషయం సుస్పస్టం... మీకు మీ ప్రాణాలు అంటే తీపి అవతలవారి జీవితాలు అంటే మాత్రం విరక్తి....వినడానికి విడ్డూరంగా ఉన్నా ...ఇది మీరు గుర్తుంచుకొవలసిన వాస్తవం...


మీరు కనీస మానవీయ విలువలను గాలికి వదిలేసి, ఏ మాత్రం లొకజ్ఞానం తెలియని పసివారిని ఉద్యమం(?) అనే ఊబిలోకి లాగివారి బాల్యాన్ని చిదిమివేయడం ఏ న్యాయం..ఎవరైనా మీకు వ్యతిరేకంగా పనిచేస్తే, మరుక్షణం ఇన్‌ఫార్మర్ అనే నెపంతో వాడి ప్రాణాలను గాలిలో కలిపెయ్యడం, ఆ కుటుంబాన్ని వీధిన పడెయ్యడం మీకు వెన్నతో పెట్టిన విద్య..మీరు మీ ఉద్యమంలో సామాన్యులని సమిధులగా వాడుకొని వారి జీవితాలను దుర్భరం చేస్తున్నారు అన్నది కాదనలేని కఠోరమైన నిజం..బహుసా మీ కన్న నియంతలు నయమేమో


నన్ను చాలకాలంగా ఒక సందేహం పట్టి పీడిస్తుంది మీ పొరాటం(?) గురించి... ఏముంది మీకు, సరిహద్దు ఆవల వున్నవారికి తేడా..???!!!!
వారు పరాయి దేశస్తులను చంపుతుంటే మీరు ఒకరికి మేలు చేస్తున్నాం అనే భ్రమలో అమాయక సోదరులను లేక విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యొగులను పొట్టన పెట్టుకోవడం తప్ప...


అందుకే ఒక్కసారి ఆలోచించండి...తుపాకి గొట్టంతో రాజ్యాధికారం సాధిస్తాం అని అనుకోవడానికి ఇది నేపాల్ వంటి కుగ్రామం కాదు..ఇక్కడున్నది రాజరికం అంతకన్నా కాదు.. అయినా 120 కోట్లమంది నమ్ముతున్న భారత రాజ్యాంగవ్యవస్థను మీరు ఎందుకు నమ్మలేకపొతున్నారు.. 30, 40 యేళ్ళనాటి పరిస్థితులువేరు..ఇప్పుడు పరిస్థితి వేరు.. ఇంకా మారాల్సి ఉన్నప్పటకి, ప్రజల జీవనప్రమాణాలలో చాలా మార్పు వచ్చింది..కానీ ఖచ్చితంగా మారాల్సింది మాత్రం మీ కాలం చెల్లిన సిద్ధాంతాలు ....


ఒక్క క్షణం ఆత్మపరిశీలనకై వెచ్చించండి మీలో ఎంతమందికి భావసారూప్యత వుంది...మీలో ఎంతమందికి మీ సిధ్ధాంతాల మీద అవగాహన వుంది ...చాలమంది ఏదో భావావేశంలో ఉద్యమంలో చేరిన వారే...ఆన్యాయం జరిగిందని ప్రతీఒక్కరు పగ, ప్రతీకారాలతో రగిలిపొతే మిగిలేది ఎముకల గూడు మాత్రమే ...ఎందుకంటే ప్రతీ మనిషి ఎదొ ఒక స్థాయిలో ఎలానోఒకలా దగా పడే వుంటాడు..


ఒక్కమనవి...చంపాల్సింది వ్యక్తులను కాదు ...ముందు మీ బూజు పట్టిన సిద్ధాంతాలను తరువాత ఏలికల సిద్ధాంతాలను...మీరు ఎక్కడో కొండలలో ఉండి ఆటవిక న్యాయంని నమ్మేబదులు...ప్రజాజీవితంలో ఉండి నిర్మాణాత్మకమైన పద్ధతిలో ప్రజాచైతన్యం ద్వారా సమాజమలో మార్పు తీసుకురాగలిగితే ప్రతీ సగటు భారతీయుడి కలల సమాజం వాస్తవరూపం దాలుస్తుంది


ఇట్లు,
ఓ సామాన్యుడు..