Thursday 1 July 2010

అభినందనీయం

ఇంధనధరలపై  ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేత అని అనగానే సామాన్యుడుపై పెట్రోబాంబు అని ఒకరు, సామాన్యుడి నడ్డివిరిచిన ప్రభుత్వం అని మరొకరు, నట్టింటపేలిన సిలండర్ అని ఇంకొకరు దుమ్మెత్తి పోస్తూనేఉన్నారు.. ఇంకోపక్క ఊసరవెల్లి రాజకీయపక్షాలు బందుకి పిలుపునిచ్చాయి......

నిజంగా కేంద్ర ప్రభుత్వం చేసింది అంత పెద్ద తప్పా ??  ఏమో నాకు మాత్రం ఇవి కాస్త అర్ధవంతమైన సంస్కరణలుగా కనిపిస్తున్నాయి.....అయినా వేల రూపాయలు పొసి ద్విచక్ర వాహనం, లక్షలు సమర్పించి నాలుగు చక్రాల వాహనం కొనుగోలు చెసేవారికి ఇది నిజంగా భారమా....కానే కాదు అని నా గట్టి నమ్మకం....ఒకవేల నిజంగా అది మనకి భారమైతే అది పర్యావరణానికి చాల మేలు చెస్తుంది :) కానీ ఈ ధరల పెరుగుదలవలన నిరుపేదల జీవితాలపై పరోక్షంగా ప్రభావం పడుతుంది అన్నది ఎవరూ కాదనలేని వాస్తవం ....బహుశా ప్రభుత్వం ఈ దిశగా అలోచన చేసి ఈ ధరల పెరుగుదల ప్రభావం ప్రజా రవాణా వ్యవస్థ మీద నిత్యావసరాల సరఫరా మీద లేకుండా చేస్తే ఈ సంస్కరణలకు మానవీయకొణం జొడించినట్లవుతుంది.

ఇక వంట గ్యాస్ విషయానికివస్తే నిజంగా ఇందులో ప్రభుత్వం ఇస్తున్న 200 రూపాయల రాయితీ ఎంతమందికి అవసరం..ఈ రాయితీ లేకపొతే ఎంతమంది దీనిని కొనలేక వాడకానికి దూరం అవుతారు...బహుశా ఇప్పుడున్న వినియొగదారులలో కొద్దిమంది మాత్రమే ఈ అవసరం ఉండి ఉంటుంది.....ఎందుకంటే ఇది ఇంకా చాలామంది భారతీయులకు అందని ద్రాక్షే   ఇక నిరుపేద ఇంట్లో దీపం వెలిగించే కిరోసిన్ మీద పెంపును నేను కూడా కాస్తా జీర్ణం చెసుకోలేకపోయను...కాని కాస్తా ఊరట కలిగించే విషయం ఏమిటంటే వీటి ధరల వ్యవస్థను ప్రభుత్వం తన గుప్పెట్లోనే ఉంచుకుంది  మన పక్క దేశాలతో పోల్చి చూస్తే ఈ పేదవాడి వంటగ్యాస్ మీద ప్రభుత్వం చాలా రాయితీ ఇస్తుంది ( బంగ్లాదేశ్, పాకిస్తాన్ మరియు నేపాల్లో  30 రూపాయలు పైన, శ్రీలంకలో 21 రూపాయలు) ... అయినా ప్రభుత్వం వంటగ్యాస్, కిరోసిన్ విషయంలో కాస్తా సరళంగా వ్యవహరించి వుండి ఉండాల్సింది..ఇప్పుడు ఇస్తున్న రాయితీలకు ఎగువ మధ్యతరగతి మరియు సంపన్న కుటుంబాలను దూరంచేసి పేదవాడికి, మధ్యతరగతికి మరింత భారం కాకుండా చూడవలసిన గురుతరమైన బాధ్యత ప్రభుత్వానిదే  

స్థూలంగా చూస్తే ఇవి చాలా అవసరమైన సంస్కరణలు ...అర్హులుకి, అనర్హులకి అందరికీ రాయితీల పేరిట ప్రభుత్వం లక్షల కొట్ల రూపాయల భారం మోయడం అర్ధరహితం. దేశ ఆర్ధిక వ్యవస్థని పట్టాలు తప్పించే ప్రజాకర్షక విధానాలను ఎన్నికల దృష్టితో చూడకుండా కొంతవరకు వాటికి స్వస్తి పలకడం నిజంగా అభినందనీయం..ఇలాంటి చేదు గులికలకు మద్దతునివ్వడం మనందరి భాద్యత కూడా !!!!!!!!!