Saturday 6 March 2010

నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం

ఎయిడ్స్....కేవలం మూడు అక్షరాలు ...పదమే చిన్నది... ప్రతాపం కాదు ఎందుకంటే అదో ప్రాణాంతక వ్యాధి..

నేడు దేశాన్ని అందునా మన రాష్ట్రాన్ని వణికిస్తున్న ఒక పెద్ద సమస్య... గణాంకాలని స్థూలంగా పరిశీలిస్తే ఈ మహమ్మారి ప్రభావిత రాష్ట్రాల జాబితాలో మనది ఐదవ స్థానం...కాస్తా లోతుగా పరిశీలిస్తే ఇది 90% లైంగికంగా, 4% తల్లి నుంచి బిడ్డలకు వ్యాప్తి చెందుతుండగా...కలుషిత రక్తమార్పిడి, సిరంజులు వంటివి ఇతర కారకాలు.

పైన పేర్కొన్న వ్యాప్తి కారకాలను చూస్తే, రెందు విషయాలు సుస్పష్టం:

1. ఇది లైంగికంగానె కాకుంద ఇతరత్రా కారణాలు వలన కూడా వ్యాపిస్తుంది..

2. మరి కాస్తా నిశితంగా చూస్తే ఇది కొంతమేర ఒక విషవలయంగా కనిపించకమానదు.!!! అంటే ఎయిడ్స్ బారిన పడ్డ వారినుంచి వారి జీవిత భాగస్వామికి ఆపైన వారికి పుట్టబోయే పిల్లలకి సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ..

అంతే ఈ వలయాన్ని చేధించవలసిన అవసరం ఎంతైన ఉన్నది అన్నది చాలా స్పష్టం...ఆ చేధనలో మన తరానిదే కీలక భూమిక అన్నది కాదనలేని వాస్తవం......వివాహానికి ముందు, కాబోయే జీవిత భాగస్వాములు ఇద్దరు హెచ్.ఐ.వి. పరీక్షలు చెయించుకొవడం ద్వారా తమ ప్రాణాలు నిలుపుకొనేవారు లేదా ఇంకొకరికి ప్రాణదానం చేసినవారు అవ్వవచ్చు .....మన సామజిక వ్యవస్తలో ఇది కాస్తా కష్టంతో కూడుకున్న పని అందుకే రండి నిశ్శబ్ధాన్ని ఛేదిద్దాం...మన జీవితాలలో విజేతలుగ నిలుద్దాం...ఎందుకంటే ఎయిడ్స్ కేవలం పులిరాజాలకు మాత్రమే రాదు

దేశమంటే మట్టికాదోయ్..దేశమంటే ఆరొగ్యకరమయిన మనుషులోయ్