Monday 7 June 2010

పర్యావరణం

ఏ ఏటికాయేడు పెరిగిపోతున్న ఎండలు.... అకాల వర్షాలూ...గతితప్పిన ఋతుపవనాలు....కరువు కాటకాలు....కొత్త రోగాలు...........సమస్య రూపాలే వేరు కానీ అన్నింటికీ మూలం మాత్రం మనమే..నిజంగా నిజం ...ఈ ప్రకృతికి ఈ విళయతాండవం నేర్పింది మనం


మరింత సుఖవంతమయన జీవితం అనే స్వార్ధ తలంపుతో మారిన లేక మారుతున్న మన జీవనశైలి  నేడు ఈ భూగోళం మీద ఉన్న కొన్ని రకాల జీవచరాలకు పెనుశాపంగా పరిణమించింది. అది మరింతగా రూపాంతరంచెంది మనల్ని కబళించకముందే మనం నిద్రలేవాల్సిన అవసరం ఉంది... ఇది మనందరి బాధ్యత...పర్యావరణ దినోత్సవం (5 జూన్) సందర్భంగా మన బాధ్యతలను ఒక్కసారి గుర్తుచెసుకుందాము అన్నదే ఈ నా టపా ఉద్దేశ్యం     


ఒక్క నిమిషం విద్యుత్ లేకపొతే ఆపసోపాలు పడే మనం దాని విలువను నిజంగా గుర్తించలేకపొతున్నాం.. మనకి ఆ విలువే తెలిసుంటే మన ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాలలో బహుశా విద్యుత్ వృధా అయ్యెది కాదేమో...మనుష్యులు లేకపొయిన వెలిగే విద్యుత్  దీపాలు, గోడలను చల్లబరచడానికి  తిరిగే ఫంకాలు, విశ్రాంతి అంతే ఎంటో తెలియని కంప్యూటర్ స్క్రీన్స్ చెప్పకనే చెబుతాయి మనకి విద్యుత్ పొదుపు మీద పర్యావరణం మీదా ఉన్న శ్రద్ధని..  విద్యుత్ పొదుపు అంటే కేవలం డబ్బు పొదుపు కాదు అని మనం మరవకూడని విషయం... విద్యుత్ ఆదా చెస్తే దాని ఉత్పత్తిలో వాడే బొగ్గుని, నీటిని, ఇంధనాన్ని  తద్వారా కాలుష్య ఉద్గారాలను తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించుకొలేమా...  


వాహనాలలోకి ఇంధనం నింపుకొనేటప్పుడు ఒక్కచుక్క ఇంధనం కిందపడితే నానా యాగి చేసేవాల్లు  లేదా అయ్యయ్యో అని బాధపడేవారు మనలో కొకొల్లలు..కానీ అదే పాత్రల కొలది నీరు వృధా అవుతున్నా మనలో చాలామందికి కనీసం చలనం ఉండదు..కానీ మనం ఎల్లప్పుడు గుర్తు పెట్టుకోవలసిన విషయం నీటిని సంరక్షిస్తే భూగర్భ జలాలను రక్షించుకోవడంతో పాటుగా, ఆ నీటిని తొడేందుకు అయ్యే విద్యుత్ ఆదా తద్వారా పర్యావరణ పరిరక్షణ అని 


శిలాజ ఇంధణాల విచ్చలవిడి వినియోగం వలన వాతావరణంలోకి విడుదల అవుతున్న విష ఉద్గారాలవలన పర్యావరణం మీదపదుతున్న ప్రభావం ఇంతా అంత కాదు....దీనికి తోడు మన ఆరోగ్యం మీద ఇవి చూపించే ప్రభావం మన తప్పులకు బోనస్....నేడు మోటార్ వాహనాల వినియోగం చూస్తే నాకు కర్ణుడు గుర్తుకు వస్తాడు, ఆయన కవచకుండలాలతో పుట్టినట్టు మనలో చాలా మంది మోటార్ వాహనంతో పుట్టమా అని అనిపిస్తుంది. తుమ్మడానికి, దగ్గడానికి కూడా వాహనంవాడే వాల్లు మనలో చాలామంది ఉన్నారంటే పెద్ద అతిశయోక్తి కాదేమో. వారంలో కనీసం ఒకరోజు ప్రజారవాణా వ్యవస్థ వాడడం, సైకిల్ వంటి కాలుష్యరహిత వాహనాలను వాడడం ద్వారా కొంత వరకు మనం ప్రకృతితో సహజీవనన్ని క్షేమంగా కొనసాగించవచ్చు


మన జీవనశైలిలో ప్రక్రృతిపైకి కత్తి దూస్తున్న మరో మన అలవాటు ప్లాస్టిక్ వినియోగం.. శాస్త్రవేత్తలు మరియు పర్యావరణవేత్తలు ఎంత నెత్తీ నొరు బాదుకుంటున్న, చెవిటివాడిముందు శంఖం ఊదినట్టుగా తయారయింది మన చందం. ఈ ప్లాస్టిక్ వ్యర్ధాలు మట్టిలో కలవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది అన్న నిజం మనలో చాల మందికి తెలిసిన, అదంతా దున్నపొతు మీద వర్షం కురిసినట్టే...ప్లాస్టిక్ కి ఎన్నొ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి వాటి వైపు మరలాల్సిన అవసరం ఇప్పటికైనా చాలా వుంది....


ఇలా చెప్పుకుంటూ పొతే కొకొల్లలు ...అందుకే మన దైనందిన జీవితంలో వాడె ప్రతీ వస్తువుని మనం పర్యావరణం దృష్టితో వాడవలసిన అవసరం ఎంతైనా ఉంది అది మనం వ్రాయడానికి  వాడుకొనే కాగితం ఐనా లేక ఇతర అవసరాలకు వాడే టిష్యూ పేపర్ ఐనా. చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలకి ఆస్తిపాస్తులు ఇవ్వడం మాత్రమే వారి బాధ్యత అనుకుంటారు.. కాని డబ్బు ఒకటే వారి బంగరు భవితకు బాటలు వేస్తుంది అనుకుంటే అది ఖచ్చితంగా వారి అమాయకత్యం అవుతుంది ..ఎందుకంటే మనం మారితేనే రేపటి తరానికి మనుగడ..

9 comments:

వీరుభొట్ల వెంకట గణేష్ said...

Truly Said.

jaypatch said...

This is not just an environmental or lifestyle issue. Its directly related to industrialization and employment. A lot of business is associated with it along with human growth. So, where do you stop that?. It can only be stopped if we go back to caves.

saamanyudu said...
This comment has been removed by the author.
రంగావఝ్యుల శేషాంజనేయావధాని శర్మ said...

పర్యావరణం గురి౦చి చాలా బాగా చెప్పారు మీలా౦టి ఆలోచన అ౦దరికి వు౦టే మన౦ పర్యావరణము కాపాడుకోవచ్చు

saamanyudu said...

jaypatch:
మనమేదో రాతి యుగానికి వెళ్ళిపోదాము అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు...సహజవనరులను వాడుతున్నప్పుడు కాస్త విచక్షన వుండాలి అన్నది నా అభిప్రాయం మనమందరం కాగితాన్ని పొదుపుగా వాడమంతే, దాని అర్ధం కాగితం బదులు పలక వాడమని కాదు.. బాంక్ లేదా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ తీసుకొనేటప్పుడు ఫిజికల్ స్టేట్మెంట్ బదులుగా ఇ-స్టేట్మెంట్ తీసుకుంటే దీర్ఘకాలంలో చాలా ప్రభావం చూపుతుందని నా ఉద్దేశ్యం

vani said...

we do not have any alternatives for petrol. Its consumption became a part of our life. I do not see anything that could be done here... But yes we can always say no to plastic. I dont know why the Govt. is not banning the usage of plastic bags. We have already seen the consequences of this in Bombay 4 yrs back(the hole metro spent 2 days in water).The plastic always has supplements like jute bags etc.

saamanyudu said...

Vani:
ఈ ఇంధనాల విషయంలో మనం ప్రత్యక్షంగా ఏమి చెయ్యలెకపొవచ్చు ...కానీ ఇంధనాల ఖర్చు విషయంలో పొదుపు పాటించడం చాలా ముఖ్యం అన్నది నా అభిప్రాయం... మన రాష్ట్రంలో ఇప్పటికే ప్లాస్టిక్ మీద నిషేధం ఉంది... ఐనా ఇలాంటి విషయాలలో చట్టాలు కన్న మనలో చైతన్యం ముఖ్యం..

సాయిరాం ప్రసాద్ (ప్రధానోపాధ్యాయుడు), నేకునాంపేట, కొండాపురం మండలం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, said...

paryavaranam gurinchi cheppe dhanikunte chesi choopadam melu.

saamanyudu said...

సాయిరాం ప్రసాద్ గారు,నేను పాటిస్తున్న విషయాన్నే అందరితో పంచుకున్నాను..